గ్రామ వార్డు పంచాయతీ కార్యదర్శులు వీఆర్‌వోల కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్షకు ఏపీపీఎస్సీ ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఏపీపీఎస్సీ పరిధిలోని స్వర్ణ గ్రామ వార్డు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ 2 మరియు వీఆర్‌వో గ్రేడ్ 1 అధికారుల కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి అక్టోబరు ఏడో తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.