నదుల అనుసంధాన నిర్వాసితుల వినూత్న నిరసన

రిపోర్టర్: అశోక్ స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని పన్నా ప్రాంతంలో కెన్‌-బెట్వా ప్రాజెక్టులో భాగంగా మజగవా, రూంజ్‌ నదుల అనుసంధానం వల్ల నిర్వాసితులైన రైతులు తగిన నష్టపరిహారం, పునరావాసం కోరుతూ ఆందోళన చేపట్టారు. ఆదివారం జరిగిన ఈ నిరసనలో భాగంగా పలువురు ఆందోళనకారులు నీటిలో చితులు పేర్చుకుని వాటిపై శవాల్లా పడుకుని, మరికొందరు ఉరి బిగించుకుని తమ నిరసనను వినూత్నంగా వ్యక్తంచేశారు.