ఢిల్లీలో భారీగా పెరగనున్న భూముల ధరలు: వ్యవసాయ భూ సర్కిల్ రేట్ల సవరణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో పద్దెనిమిది ఏళ్ల తర్వాత వ్యవసాయ భూముల సర్కిల్ రేట్లను భారీగా సవరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ ఢిల్లీలో ఎకరా ధరను ఐదు కోట్ల రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. రెవెన్యూ రికార్డులను వాస్తవ మార్కెట్ విలువకు చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ పరిధిలో ఈ కొత్త విధానం త్వరలోనే అమల్లోకి రానుంది.