సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత: చిత్తూరులో ఆర్టీఐ వారోత్సవ యాత్ర ప్రారంభం
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
చిత్తూరు జిల్లా పట్టణ కేంద్రంలో సమాచార హక్కు చట్టం అవేర్నస్ సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ ఆర్టీఐ వారోత్సవ యాత్ర ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ కూడలి వద్ద జాతీయ సీఈవో జ్యోతి ప్రకాష్ ఈ యాత్రను ప్రారంభించారు. ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం మరియు పౌరులకు ఈ చట్టంపై అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు.