జగిత్యాల జిల్లా కేంద్రంలో అపశృతి: మంత్రి లక్ష్మణ్ ఎక్కిన లిఫ్ట్ తెగిపడటంతో కలకలం

రిపోర్టర్: సతీష్ స్థలం: Jagtial

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడినట్లు Telugu Scribe వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో లిఫ్ట్లో మంత్రి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాణ్యతా లోపాల వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.