నగరి ఎమ్మెల్యే చొరవతో వడమాలపేటలో దశాబ్దాల రోడ్డు సమస్యకు పరిష్కారం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో వడమాలపేట మండల ప్రజల దశాబ్దాల రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. వడమాల మెయిన్ రోడ్డు నుండి వడ్డి ఇండ్లు వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేకు, కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.