అర్వపల్లి రహదారిపై భారీ కోత తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు మండలంలోని అర్వపల్లి గ్రామం వద్ద రహదారి భారీగా కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతినడంతో నిత్యం ప్రయాణించే వెళ్ళేరుపాడు, కుక్కునూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇదే మార్గంలో వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, గ్రామస్తులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.