బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుంభాల రాజేష్ నియామకం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుంభాల రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన వర్గాల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం రాజేష్ కృషి చేస్తానని స్పష్టం చేశారు.