ఎస్ఐఆర్ ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎంసీపీఐయూ ....

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎస్ఐఆర్ ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు. ప్రభుత్వం సూచించిన పత్రాల విషయంలో బీఎల్ఓలు అదనంగా పత్రాలు కోరుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.