కవలి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వైభవంగా చిన్న శేష వాహన సేవ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కావలి

కావలి పట్టణంలోని బృందావన కాలనీ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారు చిన్న శేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ జరిగిన ఈ పవిత్ర ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించగా, మహిళలు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందిని ఆలయ నిర్వాహకులు తెలిపారు.