షూటింగ్ డెసిమల్స్‌లో చేజారిన స్వర్ణం రజతంతో సరిపెట్టుకున్న ఏలవెనిల్
రిపోర్టర్: విజయ్
స్థలం: Japan
జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చరల్ జనరల్ షూటింగ్ గ్యాలరీలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో భారత షూటర్ ఏలవెనిల్ వలరివన్ రజత పతకం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుండి ఆధిక్యంలో నిలిచిన ఏలవెనిల్, తుది దశలో స్వల్ప తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయి రజతంతో సరిపెట్టుకుంది. ఇదే విభాగంలో సోనమ్ మస్కార్, విదర్స వినోద్‌లతో కలిసి జట్టు విభాగంలోనూ ఏలవెనిల్ రజత పతకం సాధించి భారత్‌కు గొప్ప గర్వకారణంగా నిలిచింది.