గొట్టా బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం
రిపోర్టర్: సతీష్
స్థలం: హీరమండలం
శ్రీకాకుళం జిల్లా హీరమండలం మండలంలోని వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి సైరన్ మోగించారు. బ్యారేజ్‌లోకి 36,690 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 40,079 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వంశధార పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.