బెల్లంపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: NARESH
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లిలోని గంగారాం నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను కౌన్సిలర్లు దొంగల రాజకుమార్ యాదవ్, తిరుమల వాసు శాలువాలతో సత్కరించి గౌరవించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లను ఉపాధ్యాయులు కూడా ఘనంగా సన్మానించారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని, వారి సేవలను గుర్తించడం అభినందనీయమని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.