కోనసీమలో యువతకు ఉపాధి అవకాశాలు: అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: కోనసీమ
కోనసీమ ప్రాంతంలో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ వెల్లడించారు. స్థానిక యువత స్వయం ఉపాధి పొందేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలువురు యువతీయువకులు, స్థానిక నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.