విజయవాడ విమానాశ్రయంలో రద్దీ పెరిగినా అరకొరగానే విమాన సర్వీసులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 500% పెరిగి ఏటా 14 లక్షలకు చేరినా, సర్వీసులు మాత్రం అరకొరగానే ఉన్నాయి. అంతర్జాతీయ హోదా వచ్చి పదేళ్లు దాటినా, కేవలం రెండు విదేశీ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. రన్వే విస్తరణ, ఆధునిక సౌకర్యాలు ఉన్నా, విమానయాన సంస్థలు సర్వీసులు పెంచకపోవడంతో ప్రయాణికులు హైదరాబాద్, బెంగళూరు మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. 80% ఆక్యుపెన్సీ ఉన్నా సర్వీసుల పెంపుపై నిర్లక్ష్యం వహించడం గమనార్హం.