భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్షిప్ దక్కించుకున్న ముత్తూట్ ఫైనాన్స్
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి అంతర్జాతీయ మరియు దేశీయ మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ముత్తూట్ ఫైనాన్స్ దక్కించుకుంది. రెండు సంవత్సరాల కాలానికి ఈ కీలక ఒప్పందం కుదిరినట్లు బీసీసీఐ వెల్లడించింది. మార్చి 2028 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌తో ఈ ప్రాయోజకత్వం ప్రారంభమవుతుందని బోర్డు స్పష్టం చేసింది.