రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇరవై ఐదు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. పది రోజుల ఉత్సవాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయని, పోలీసుల సమన్వయం వల్లే నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగిందని ఆయన పేర్కొన్నారు.