13 రోజులకే పాస్‌పోర్ట్ పొంది రికార్డు సృష్టించిన శ్రీకాకుళం చిన్నారి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన అగస్య ప్రిన్సీ కేవలం 13 రోజుల వయసులోనే పాస్‌పోర్ట్ పొంది అరుదైన రికార్డు సృష్టించింది. గతంలో 19 రోజుల చిన్నారి పేరున ఉన్న రికార్డును ఈ పాప అధిగమించింది. లండన్‌లో సేవలందిస్తున్న తండ్రి వద్దకు వెళ్లేందుకు దరఖాస్తు చేయగా, జూన్ 12న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.