భూటాన్ లో భారీగా గ్లేసియల్ సరస్సు విస్ఫోటనం: లోతట్టు ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: సతీష్
స్థలం: Bhutan
భూటాన్ లోని లెంథాంగ్ వద్ద గ్లేసియల్ సరస్సు విస్ఫోటనం చెందిందని, దీని కారణంగా పొంగి ప్రవహిస్తున్న నీరు మోఫు నది గుండా సుంకోష్ నది వైపుగా కిందికి పారుతోందని బీజేపీ ఎంపీ రాజు బిస్తా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా నదుల పరీవాహక ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. భద్రతా చర్యలపై అధికార యంత్రాంగం ముమ్మరంగా తక్షణ ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.