హర్యానాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి హత్య, ఇద్దరి అరెస్ట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హర్యానా
హర్యానాలోని రేవారిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం అనుమానంతో జితేందర్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు ప్రవీణ్, మేనల్లుడు అమన్ కలిసి హత్య చేసినట్లు తేల్చారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సెప్టెంబర్ 7న హెచ్‌పీసీఎల్ రిఫైనరీ సమీపంలో జితేందర్ మృతదేహం లభించింది. బీర్ పార్టీకి పిలిచి జితేందర్‌ను తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.