గురువుల సేవలకు విద్యార్థుల వందనం: శ్రీచైతన్యలో వేడుకలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్లోని శ్రీచైతన్య స్కూల్లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. AGM ఎం. వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్వేత బాన్స్, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గురువుల పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.