దేశసేవలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున చిత్తూరు పార్లమెంటు పరిశీలకుల కమిటీ సభ్యుడు, జీడీ నెల్లూరు నియోజకవర్గ సమస్త ఎన్నికల అబ్జర్వర్ కంజేరి చందు అలియాస్ చంద్రశేఖర్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.