కర్ణాటకలో పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటాం: మంత్రి రామలింగారెడ్డి

రిపోర్టర్: గోపి స్థలం: కర్ణాటక

కర్ణాటకలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీశాఖ మంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు. పౌర సమాజం, పర్యావరణ వేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తురహళ్లి అడవుల సంరక్షణ, ఏనుగుల వాడకంపై నిషేధం, ప్లాస్టిక్ నియంత్రణ వంటి అంశాలపై సానుకూలంగా స్పందించారు. చట్టాల్లో తగిన మార్పులు చేసి వన్యప్రాణులు, వృక్ష సంపదను కాపాడుతామని హామీ ఇచ్చారు.