'మేమే నిజమైన వైఎస్సార్ వారసులం': బీజేపీపై కాంగ్రెస్ నేతల ఫైర్

రిపోర్టర్: రాము స్థలం: Amaravati

మేమే నిజమైన వైఎస్సార్ వారసులమని, ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాడిన వైఎస్సార్ చూపించిన దారిలోనే ముందుకు సాగుతామని వెల్లడించారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ లాంటి పార్టీలకు దూరంగా ఉంటామని, ఆ పార్టీని ఎదిరించి పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఘాటుగా విమర్శించారు.