విశాఖలో తెదేపాలోకి భారీ వలసలు: పార్టీలోకి చేరిన సుమారు రెండు వందల మంది
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నుంచి తెదేపాలోకి వలసల పర్వం ఊపందుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఇరవై నాలుగు, ఇరవై ఐదు వార్డుల నుంచి సుమారు రెండు వందల మంది కార్యకర్తలు తెదేపాలో చేరారు. విశాఖ ఎన్నికల పరిశీలకులు ఫరూక్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్లమెంట్ విభాగం అధ్యక్షుడు పట్టాభి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించినట్లు తెలిపారు.