తల్లి బిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ఐసిడిఎస్ అధికారులు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో పోషణ మాస ఉత్సవాలలో భాగంగా తల్లి బిడ్డల ఆరోగ్యంపై తల్లులకు అవగాహన ఎంతైనా అవసరమని ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో తల్లులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.