రామాయణ ఇతిహాసంతో ప్రత్యేక గుర్తింపు పొందిన నాసిక్ పంచవటి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నాసిక్
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన పంచవటి రామాయణ ఇతిహాసంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఐదు పవిత్ర వృక్షాల సముదాయంగా భావించే ఈ ప్రాంతంలోనే సీతారామలక్ష్మణులు పర్ణశాల నిర్మించుకుని నివసించారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కోయడం, సీతాపహరణం వంటి కీలక ఘట్టాలు ఇక్కడే జరిగాయని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ సీతా గుహ, రామకుండ్, కపాలేశ్వర్ మందిర్ వంటి అనేక దర్శనీయ చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.