ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘన నివాళి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నాగర్ కర్నూల్
ఉక్కుమనిషి డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. ఈ సందర్భంగా భారతదేశపు తొలి ఉప ప్రధాని మరియు కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశ సమైక్యతకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకల్లో భాగంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.