ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపి కబురు: త్వరలో ఖాతాల్లోకి ఫైనల్ బిల్లులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఖమ్మం
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు త్వరలోనే పెండింగ్ ఫైనల్ బిల్లులు అందజేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న పేదలు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తామని, సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.