ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాజీనామా చేయాలని సీపీఎం డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సంస్థాన్ నారాయణపూర్
ఎన్నికల కమిషన్ చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా రామన్నపేట సుభాష్ సెంటర్లో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఈసీని తమ గుప్పిట్లో పెట్టుకుందని సీపీఎం జిల్లా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.