సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూముల్లో అమరవీరుల కాలనీ నిర్మించాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325 భూములను అర్హులైన స్థానిక రైతులకు పంపిణీ చేయాలని, అలాగే తెలంగాణ ఉద్యమ అమరవీరుల జ్ఞాపకార్థం ప్రత్యేకంగా అమరవీరుల కాలనీని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఈ కాలనీని త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.