మోత్కూరులో కాలం చెల్లిన తినుబండారాల విక్రయంపై తీవ్ర ఆందోళన

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ప్రైవేట్ మాల్లో గడువు ముగిసిన బిస్కెట్లు, చాక్లెట్లు విక్రయిస్తుండటాన్ని బాధితులు గుర్తించారు. సిబ్బందిని ప్రశ్నించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు, ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.