రాష్ట్రంలో తీవ్రంగా వేధిస్తున్న ఇరవై రెండు ఏ నిషేధిత భూముల సమస్య

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా భూముల సమస్య రోజురోజుకూ మరింత జటిలమవుతున్నది. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకుండా, క్రమబద్ధీకరణ పేరిట ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలతో అధికారులంతా గందరగోళానికి గురవుతూ దరఖాస్తులను పక్కనపెడుతుండటంతో బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు.