భూపాలపల్లిలో ఎడతెరిపిలేని వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
రిపోర్టర్: రమేష్
స్థలం: భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని, కేటీకే ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వానల వల్ల సుమారు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలో సగటున 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, అత్యధికంగా టేకుమట్ల, చిట్యాల మండలాల్లో వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు.