పన్వెల్ వద్ద సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డ నిందితుడి అరెస్ట్
రిపోర్టర్: మహేష్
స్థలం: Navi Mumbai
మహారాష్ట్రలోని పన్వెల్ తాలూకా బర్వై గ్రామంలోని ఒక టీ స్టాల్లో సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడిన పందొమ్మిదేళ్ల నిందితుడిని నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ ఔదుంబర్ పాటిల్ తెలిపారు. నిందితుడి నుంచి సెల్ ఫోన్ తో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.