పర్యావరణ హితం కోరుతూ మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన యువత
రిపోర్టర్: Pydi. Suryanarayana
స్థలం: ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన యువత తమ గ్రామ పరిధిలో శుక్రవారం ఇంటింటికి మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగులు గల విగ్రహాలను పూజా కార్యక్రమాలకు వాడ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిందూ ఆధ్యాత్మిక భావాలకు, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయి కలపాలని పేర్కొన్నారు. అలాగే గ్రామస్తులందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.