రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి చేసిన పృథ్విరాజ్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'లో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమాలకు నటులు ఏళ్ల తరబడి కేటాయించాల్సి ఉంటుంది. కానీ పృథ్విరాజ్ మాత్రం ఈ సినిమాతో పాటు నటుడిగా, దర్శకుడిగా ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో ఆయన 'కుంభ' అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.