ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు: విద్యార్థుల నిరసనలతో వెనక్కి

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ పీహెచ్డీ ప్రవేశాల కోసం విడుదల చేసిన ఇంటర్వ్యూల నోటిఫికేషన్ను అధికారులు రద్దు చేశారు. అభ్యర్థులకు కనీస సమయం ఇవ్వకుండా హడావుడిగా ఇంటర్వ్యూలు నిర్వహించడాన్ని తప్పుపడుతూ విద్యార్థులు తీవ్ర నిరసనలు తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.