నిరుద్యోగులకు గుడ్ న్యూస్: లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఒప్పంద ప్రాతిపదికన లైబ్రేరియన్ అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రెండు ఖాళీలు ఉన్నట్లు వారు వెల్లడించారు. అర్హత గల అభ్యర్థులు ప్రకటన వెలువడిన పదిహేను రోజుల్లోపు ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని స్పష్టం చేశారు. లైబ్రరీ సైన్స్లో డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి అని అధికారులు తేల్చిచెప్పారు.