ప్రజాధనంతో ట్రంప్ టీవీ ప్రకటనలు: ఫెడరల్ కోర్టులో డెమొక్రాట్ల పిటిషన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిధులతో తనను తాను ప్రచారం చేసుకుంటున్నారని డెమొక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో ఇచ్చిన టీవీ ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వాషింగ్టన్లోని ఫెడరల్ కోర్టులో డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎన్నికల ప్రచారం కోసం పబ్లిక్ మనీని వినియోగించడం చట్టవిరుద్ధమని, ఇది నిష్పక్షపాత ఎన్నికలకు విఘాతం కలిగిస్తుందని డెమొక్రాట్లు ఆరోపించారు.