విద్యారంగంలో కీలక సంస్కరణలు: మైనారిటీ సెల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Umiam
పాఠశాల విద్యను మరింత మెరుగుపరచడం, డ్రాప్అవుట్ రేటును తగ్గించడం మరియు ఉపాధ్యాయుల శిక్షణను బలోపేతం చేయడంపై ఎన్సీఈఆర్టీ మైనారిటీ సెల్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మేఘాలయలోని ఉమియామ్ నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ రంజనా అరోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యా రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు కరిక్యులమ్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్ విభాగం అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.