రాష్ట్రంలో రూ.5 లక్షల బీమాతో ఇందిరమ్మ ధీమా
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల బీమా రక్షణ కల్పించేలా నవంబర్ 19న ఇందిరమ్మ ధీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఉచిత విద్యుత్ మరియు రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.