'నానో ఎరువులతో అధిక దిగుబడి': ఇంద్రవెల్లిలో వ్యవసాయాధికారి గణేష్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పిప్రి గ్రామంలో రైతులకు నానో ఎరువుల వాడకంపై బుధవారం వ్యవసాయాధికారి రాథోడ్ గణేష్ అవగాహన కల్పించారు. నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను వాడడం వల్ల అధిక దిగుబడితో పాటు భూసారం కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. కేవలం 500 ఎంఎల్ నానో యూరియా బాటిల్‌తో ఎకరాకు సరిపడా ఫలితం వస్తుందని, దీని ధర రూ. 220 మాత్రమేనని, మోయడానికి, చల్లడానికి ఎంతో సులువుగా ఉంటుందని ఏవో గణేష్ వివరించారు.