నూజివీడులో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

రిపోర్టర్: హరి స్థలం: Nuzvid, Andhra Pradesh

నూజివీడులో ఎమ్మార్ అప్పారావు కాలనీ ఆర్చిపై పేరు తొలగింపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆందోళన చేపట్టారు. కూటమి నేతల ఒత్తిడితో పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని వైయస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనతో నూజివీడులో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానికంగా రాజకీయ వేడి పెరిగింది.