అమెరికాలో ఘనంగా తానా తెలుగు బడి తరగతులు ప్రారంభం

రిపోర్టర్: అశోక్ స్థలం: USA

ఉత్తర అమెరికాలో 2026-27 విద్యా సంవత్సరానికి తానా తెలుగు పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి. చిన్నారులకు సులభపద్ధతిలో తెలుగు భాషను నేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. పలు విభాగాలలో శిక్షణనిస్తూ, అమ్మనాన్నలతో తెలుగులో మాట్లాడే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.