విద్యార్థులు మరియు మహిళల భద్రతపై తిరుపతి పోలీసుల అవగాహన

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు Tirupati Police వెల్లడించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రత, చట్టపరమైన రక్షణతో పాటు రోడ్డు భద్రత, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్పై విద్యార్థులకు కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. సమాజంలో నేరాల నియంత్రణకు, యువత సరైన మార్గంలో నడవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు.