జెఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్ష తేదీలను ప్రకటించిన ఎన్టీఏ

రిపోర్టర్: హరి స్థలం: India

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జెఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 22 నుంచి 30 వరకు ఈ పరీక్షలు జరగనుండగా, జనవరి 31ని బఫర్ తేదీగా కేటాయించారు. త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం.