నైపుణ్య శిక్షణకు కొత్త దిశ: ఒడిశా వర్సిటీ విధానాలను పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: పెద్దపల్లి
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీని సందర్శించినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. మంత్రి వివేక్ గారితో కలిసి వర్సిటీలో అమలవుతున్న లెర్న్ అండ్ ఎర్న్, లైవ్ ప్రొడక్షన్ విధానాలను పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాలను పెంపొందించడం, శిక్షణ కాలంలోనే విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం అందించే విధానాలపై తాము అధ్యయనం చేసినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.