తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు నుండి ఆరు గంటలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుమల

తిరుమల క్షేత్రంలో సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం భక్తులను నేరుగా డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తుండటంతో టోకెన్లు లేని వారికి 4 నుంచి 6 గంటలు, రూ.300 దర్శనానికి 1 నుండి 2 గంటల సమయం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 82,198 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.3.37 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.