ఎన్నికల సంఘంపై విపక్షాల దాడి సరికాదన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
రిపోర్టర్: సునీల్
స్థలం: గౌహతి
ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ ఈసీ నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీతోనే జరగాలని, సీఈసీ ఒక్కరే నిర్ణయాలు తీసుకోలేరని తెలిపారు. కాగా, రాష్ట్రంలో గత మూడేళ్లుగా ఒక్క ఖడ్గమృగం కూడా వేటకు గురికాకుండా అడవులను సంరక్షించామని, ఇది పోలీసు, అటవీ శాఖల గొప్ప విజయమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.